టీడీపీ నేతల అరెస్ట్‌లను ఖండించిన చంద్రబాబు !

by srinivas |
Chandrababu naidu
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్టులను ఖండిస్తూ చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు సంకెళ్లు వేయడంపై జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడాన్ని గర్హించారు. గుంటూరులో మహిళలపై, నాయకులపై అమానవీయంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాయడం, ప్రజాస్వామ్య విలువలను మంటగలపడం, రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను అన్నివర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed