- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిక్లరేషన్‌పై వైసీపీ రాద్ధాంతం చేసింది
దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ డిక్లరేషన్‌పై వైసీపీ రాద్ధాంతం చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం నంద్యాల టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల మనోభావాలతో సీఎం జగన్ ఆటలాడుతున్నారని సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. హైందవ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, ఆలయాల ప్రతిష్ఠ దెబ్బతీసే పరిస్థితి వచ్చిందన్నారు.
భార్య ఉన్నప్పుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టమని, జగన్‌కు ఏసుక్రీస్తుపై నమ్మకం ఉన్నందునే ఇంటిపై శిలువ చిహ్నం వేసుకున్నారన్నారు. నేను వెంకటేశ్వరస్వామిని నమ్ముతా.. ముస్లింలు అల్లాను నమ్ముతారు, నమ్మకాలను గౌరవించాలే తప్ప హేళనం చేయడం తగదన్నారు. 5శాతం ఓట్ల మార్పుతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని, మరో 5శాతం ఓట్లు టీడీపీకి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.