అందుకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు: కన్నబాబు

by srinivas |
అందుకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు: కన్నబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి కన్న బాబు అన్నారు. అబద్దాలు చెప్పనిదే చంద్రబాబుకు పూట గడవడం లేదన్నారు. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులకు టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారని చెప్పారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఒకలా..బయట మరోలా మాట్లాడుతారని చెప్పారు.

ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నందున బాబు యూటర్న్ తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఢిల్లీ పెద్దలకు అర్థం కావనే భావనలో ఉన్నారని చెప్పారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ఎంఎస్ పీ కొనసాగుతుందని పీఎం చెప్పిన తర్వాతే తాము మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఎంఎస్ పీ కొనసాగిస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed