- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికలాంగులకు 6 వేల పెన్షన్ కోసం.. చలోహైదరాబాద్
దిశ, అచ్చంపేట : వికలాంగులకు ఆరువేల పెన్షన్ ఇవ్వాలని, వికలాంగుల సంక్షేమ శాఖ స్వయం ప్రతిపత్తి కోసం అనే డిమాండ్లతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 26న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి గ్రామస్థాయి నుండి లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని కోరుతూ అమ్రాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకురాలు దరగోని వెంకటమ్మ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కరపత్రాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వికలాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని వారికి అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించడానికి, వికలాంగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడని తెలిపారు. నేడు నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి వికలాంగులు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామ వసంత కుమార్, గోపాల్, బాలస్వామి, వెంకటేశ్వర్లు, బాలస్వామి, తిరుపతయ్య, లక్ష్మీనారాయణ, సత్తార్, తదితరులు పాల్గొన్నారు.