- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేసుల నుండి తప్పించుకోవడానికే బీజేపీలోకి ఈటల'
దిశ, కమలాపూర్: మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన తెరాస కార్యకర్తల సమావేశంలో పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక పార్టీ బీజేపీఅని, అలాంటి పార్టీలో ఈటల రాజేందర్ కేసుల నుండి తప్పించుకోవడానికి చేరారని ఆరోపించారు. బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. వేల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టి టిఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతు బంధు పథకం ను వ్యతిరేకిస్తూనే రైతుబంధు కింద ఇరవై ఆరు లక్షల రూపాయలు ఎలా తీసుకున్నారు? అని ప్రశ్నించారు.
ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించ లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాలపై ఇప్పటివరకు మొండి వైఖరి ప్రదర్శిస్తుందని, పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క మంచి పథకాలు ప్రారంభించలేదని నిధుల కేటాయింపుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. కేంద్రంలో పరిపాలన లోపం వల్లే ఈ రోజు గ్యాస్ని, త్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఎద్దేవా చేశారు.