పెరోల్‌పై వరవరరావుని విడుదల చేయాలి

by Shyam |
పెరోల్‌పై వరవరరావుని విడుదల చేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: మహారాష్ట్ర తలోజా జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును పెరోల్‌పై విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన వరవరరావు కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో జైల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని పెరోల్ ఇప్పించే బాధ్యత వారి మీద ఉందన్నారు. మానవతాదృక్పథంతో మంచి మనిషిని కాపాడుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed