కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడదాం

by Shyam |
కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడదాం
X

– సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో : పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాపాడుకునేందుకు కార్మికులు ఐక్య పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కార్మికులకు పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్వీర్యంచేసే విధంగా చట్టాల్లో మార్పుల్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు లాభాన్ని చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శుక్రవారం మేడే సందర్భంగా హైదరాబాద్ లోని ఎఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. కార్మికుల ఆకలి తీర్చాల్సిన కేంద్ర ప్రభుత్వం.. కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలు ఎగవేసినవారికి వత్తాసు పలుకుతూ వారి రుణాలు మాఫీచేయడం విడ్డూరంగా ఉందన్నారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక రోడ్డున పడ్డ అసంఘటితరంగ కార్మిక కుటుంబాలకు రూ.5000ల ఆర్థిక సాయం అందజేయాలని వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags: May day, workers, Industry, Bank, Loans, Unorganized, CPI, Chada

Advertisement

Next Story

Most Viewed