‘కేంద్రం మాటలు అంతా బూటకమే’

by Shamantha N |
‘కేంద్రం మాటలు అంతా బూటకమే’
X

కోల్‌కతా: ఈ ఏడాది చివరి వరకు దేశ జానాభా మొత్తానికి వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం చెబుతున్న మాటలు అంతా ఉత్త బూటకమని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. వాళ్లంతా నిరాధారమైన స్టేట్ మెంట్స్ ఇస్తున్నారని కేంద్రంపై మండి పడింది. ఒక సమస్యకు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే కేంద్రం కనుగొంటుంది అని విమర్శించారు. ఒక వేళ దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయాల నుకుంటే కనీసం ఆరు నుంచి ఏడాది సమయం పడుతుందని అన్నారు.

భారత్‌ జనాభా 140 కోట్లు అనీ..అందులో ప్రతి ఒక్కరికీ అంత తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ ఇవ్వడమంటే చిన్న విషయం కాదనీ అన్నారు. ఇంకా ఎవరైనా కొవిడ్ నుంచి కోలుకున్న వారు ఉంటే వ్యాక్సిన్ డోసు కోసం వారు కొంత సమయం ఆగాల్సి ఉంటుందని చెప్పారు. మరో వైపు చూస్తే రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య నిర్ణీతమైన గ్యాప్ పాటించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ చూస్తే ఏడాది చివరి వరకు ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కష్టమైన పనీ అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed