వచ్చే ఏడాదిలో ప్లాస్టిక్ బ్యాన్!

by Shamantha N |
వచ్చే ఏడాదిలో ప్లాస్టిక్ బ్యాన్!
X

న్యూఢిల్లీ : వచ్చే ఏడాదిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించాలని కేంద్రం కసరత్తులు చేస్తున్నది. జనవరి 1వ తేదీ మొదలు రెండు దశల్లో వీటి వాడకాన్ని నిరోధించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే చిన్న వ్యాపారులూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నది. అందుకు అనుగుణంగా కార్యచరణను సిద్ధం చేసింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసి అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి పాలీథిన్ బ్యాగ్‌ల మందం 50 మైక్రాన్‌ల నుంచి 120 మైక్రాన్‌లకు పెంచడానికి యోచిస్తున్నది. 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే సవరించిన చట్టాలతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ల ఉత్పత్తి, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధించునుంది.

జనవరి 1 నుంచి ప్లాస్టిక్ జెండాలు, బెలూన్లకు ఉంచే ప్లాస్టిక్ స్టిక్‌లు, క్యాండీ స్టిక్‌లపై కేంద్రం నిషేధం విధించనుంది. వచ్చే ఏడాది జులై 1 తర్వాత ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాస్‌లు, ఫోర్క్స్, స్పూన్స్, కత్తులు, స్ట్రా, ట్రే, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లపై నిషేధం అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ నిషేధం అమలుకు స్థానిక సంస్థలదే బాధ్యత కానుంది. వీటికి ప్రత్యామ్నాయాలు సులువుగా లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed