కొవిడ్‌19 పై పోరుకు కేంద్రం రూ. 15వేల కోట్ల ప్యాకేజీ

by vinod kumar |   ( Updated:2020-04-09 10:08:34.0  )
కొవిడ్‌19 పై పోరుకు కేంద్రం రూ. 15వేల కోట్ల ప్యాకేజీ
X

న్యూఢిల్లీ : కొవిడ్ 19పై పోరు సల్పడానికి కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ పోరుకు సంసిద్ధమయ్యేందుకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 15వేల కోట్ల అత్యవసర ప్యాకేజీని గురువారం సాంక్షన్ చేసింది. ఈ ప్యాకేజీని ఐదు ఏళ్లకు ఉద్దేశించిన స్కీమ్‌లో ఒక క్రమపద్ధతిలో విడుదల చేయనుంది. ప్రకటించిన మొత్తాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకోవాల్సి ఉంటుంది. కొవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం రూ. 7,774ను కేంద్రం వెంటనే విడుదల చేయనుంది. మిగిలిన మొత్తం తర్వాతి నాలుగేళ్లలో రాష్ట్రాలకు అందనుంది.

కొవిడ్ 19 ఎమర్జెన్సీ సేవలు, ఆరోగ్య వ్యవస్థను సంసిద్ధం చేసేందుకు ఈ ప్యాకేజీని కేంద్రం మూడు దశలుగా అమలు చేయనుంది. మొదటి దశ జనవరి 2020 నుంచి జూన్ 2020 వరకు, 2020 జులై నుంచి 2020 మార్చి 2021 వరకు, మూడో దశ ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024వరకు అమలు చేయనుంది. ఈ స్కీం ప్రధానంగా కొవిడ్ 19 ఆస్పత్రులు, ఐసీయూలు, మెడికల్ సెంటర్లలో ఆక్సిజన్ సరఫరాల దృష్టి సారించనుంది. జాతీయ, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడం, ఈ వైరస్ నివారణకు, ఒకవేళ వైరస్ విస్తరిస్తే దాని నియంత్రణకు, అందుకు సిద్ధంగా ఉండేందుకు, మెడికల్ పరికరాలు, ఔషధాల సేకరణ, నిఘా, కొత్త ల్యాబ్‌ల ఏర్పాటు ఈ కొవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ నిధి ముఖ్య ఉద్దేశ్యమని డైరెక్టర్ ఆఫ్ నేషన్ హెల్త్ మిషన్ పేర్కొంది.

Tags: coronavirus, emergency relief package, centre, sanctioned, states, ut’s

Advertisement

Next Story