ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ఆర్‌సీ ఫీజు మాఫీ

by Harish |
ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ఆర్‌సీ ఫీజు మాఫీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్రం మరిన్ని చర్యలను తీసుకుంటోంది. దీనికోసం బ్యాటరీ ఆధారిత వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ) లేదా రెన్యూవల్ చేసుకునేందుకు ఎలాంటి ఫీజును వసూలు చేయకూడదని నిర్ణయించింది. దీనికి సంబంధించి రవాణా మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదాన్ని ప్రోత్సహించేందుకు, బ్యాటరీ ఆధరంగా నడిచే వాహనాల ఆర్‌సీ జారీ, రెన్యువల్‌కు చెల్లించే ఫీజును మాఫీ చేస్తున్నట్టు ముసాయిదాలో పేర్కొంది.

దీనికోసం సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధనలు-1989లోని 81వ నిబంధనను సవరించనున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి సలహాలు, సూచనలను నెల రోజుల్లోగా ఇవ్వాలని కోరింది. కాగా, నీతి ఆయోగ్ ప్రకారం.. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడం వల్ల చమురు వినియోగం 64 శాతం తగ్గుతుందని, కార్బన్ ఉద్గారాలను 2030 నాటికి 37 శాతానికి తగ్గించగలదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed