- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆత్మనిర్భర్ భారత్’ నిరాశపరిచింది
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీ నిరాశపరిచిందని రిటేలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలోని రిటేల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం ఈ ప్యాకేజీ గుర్తించనేలేదని ఓ ప్రకటనలో పేర్కొంది. దీర్ఘకాలంలో కేంద్రం నిర్ణయాలు మేలు చేస్తాయని వివరించింది. వేతన సంబంధిత సహకారం, ప్రిన్సిపల్ మరియు వడ్డీల చెల్లింపులపై మోరటోరియం, వర్కింగ్ క్యాపిటల్ పరమైన సహాయం ఇప్పుడు రిటేలర్‌లకు అవసరమని ఆర్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ రాజగోపాలన్ అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలేవీ తీసుకోలేదని విమర్శించారు. టీడీఎఫ్ రేట్ల కుదింపు, ఈపీఎఫ్ సంబంధిత మార్పులు కొద్ది మేరకే తోడ్పడతాయని, కానీ, తమ వ్యాపారాలు నడిచేందుకు నగదు సహాయం అందించాల్సిందని తెలిపారు. ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి సహకారం అందక.. రిటేలర్లు వ్యాపారాలను మూసివేసే స్థితికి వెళ్లారని వివరించారు. అదే జరిగితే సుమారు నాలుగున్నర కోట్ల మంది ఉపాధి జీవితం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.