లైట్లొక్కటే ఆపాలి.. గృహోపకరణాలన్నీ కాదు !

by vinod kumar |
లైట్లొక్కటే ఆపాలి.. గృహోపకరణాలన్నీ కాదు !
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాపై పోరుకు ప్రధాని మోడీ ఇచ్చిన లైట్స్ ఆఫ్ పిలుపుతో ఆదివారం దేశంలో గ్రిడ్ కుప్పకూలనుందన్న వార్తలపై కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులకు సెంట్రల్ పవర్ మినిస్ట్రీ నుంచి శనివారం ఒక లేఖ అందినట్టు తెలుస్తోంది. లైట్స్ ఆఫ్‌తో గ్రిడ్ ఫెయిలై ఇళ్లలోని గృహోపకరణాలు పాడవవని అవన్నీ ఎప్పటిలాగే ఆన్ చేసి ఉంచుకోవచ్చని తెలిపింది. 5వ తేదీ రాత్రి 9గంటలకు ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ చేయడంతో విద్యుత్ డిమాండ్ పడిపోతే ఏంచేయాలన్నదానిపై పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(పొసొకో) అధికారులతో తాము కసరత్తు చేశామని తెలిపింది. విద్యుత్ డిమాండ్‌లో ఎగుడు దిగుడులను తట్టుకునేందుకుగాను అవసరమైన ప్రోటోకాల్స్ సిద్ధం చేశామని గ్రిడ్ గురించి కంగారు పడొద్దని లైట్లు తప్ప అన్ని గృహోపకరణాలు వాడుకోవచ్చని సూచించింది. గ్రిడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలన్న దానిపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తామని పేర్కొంది. ప్రధాని పిలుపులో భాగంగా వీధి లైట్లు ఆపేయవద్దని దీని వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమవుతుందని హెచ్చరించింది. అలానే ఆస్పత్రుల్లో విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.

Tags: central power ministry, states, grid, modi lights off, corona

Advertisement

Next Story

Most Viewed