ఇప్పట్లో అలాంటి ఆలోచనేం లేదు.. 4 రోజుల పనివిధానంపై తేల్చిన కేంద్రం

by Anukaran |
no 4 days work proposal
X

దిశ, వెబ్‌డెస్క్: వారానికి నాలుగు రోజుల పనివిధానంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్మిక చట్టాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు పనిగంటలను పెంచుతూ నిర్ణయం తీసుకోగా, నాలుగురోజుల పనివిధానాన్ని కూడా అమలుచేయనున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో నాలుగు రోజుల లేక వారానికి నలభై గంటల (రోజుకు పది గంటలు) పని విధానం ప్రతిపాదనేది తమ వద్ద లేదని స్పష్టం చేశారు.

కేంద్ర పరిపాలనా కార్యాలయాల (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్)లో పని విధానంలో మార్పుల గురించి కేంద్ర వేతన కమిషన్ గతంలో ప్రతిపాదించిన సూచనలను గంగ్వార్ గుర్తు చేశారు. ఏడో వేతన సంఘం సూచించిన సిఫారసుల ఆధారంగానే ప్రస్తుత పని విధానాలున్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed