ప్రభుత్వోద్యోగులకు డీఏ లేదు!

by Harish |
ప్రభుత్వోద్యోగులకు డీఏ లేదు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇప్పటికే కొవిడ్-19 వ్యాప్తి కారణంగా ఉద్యోగులు కనీసవసరాలకు, ఈఎమ్‌లకు జడుసుకుంటుంటే కేంద్ర మరో షాక్ ఇచ్చింది. ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకిచ్చే డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) చెల్లించమని తేల్చి చెప్పింది. కేంద్ర కేబినెట్ మార్చి 13న 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలుచేయమని చెప్పేసింది. ఈ నిర్ణయం ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర కేబినెట్ కేంద్రం రూ. 27,000 కోట్ల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాది జనవరి నునంచి జూన్ నెల వరకు ఇది వర్తిస్తుందంటూ ప్రభుత్వం ప్రకటనలో స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 49.26 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులకు, 61.17 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపించనుంది. ప్రతి ఏడాది కేంద్ర పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని రెండుసార్లు సవరిస్తారు. ఈ సరవణ మళ్లీ జులై నెలలో నిర్వహించనున్నారు.

కొవిడ్-19 సంక్షోభం వల్ల దేశంలో మార్చి 24 నుంచి లాక్‌డోఉన్ అమలవుతోంది. దీంతో కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం క్షీణించింది. పరిశ్రమలు మూతపడటంతో ఉత్పత్తుల ఖర్చులు కూడా పెరిగాయి. ప్రస్తుతం నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖలకు బడ్జెట్‌లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ప్రధానమంత్రి సహా, మంత్రులు, పార్లమెంట్ సభ్యుల జీతాల్లో 30 శాతం కోత విధించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు ఆపేస్తున్నట్టు తెలిపింది. కొవిడ్-19 బాధితుల కోసమని, నష్టపోయిన ప్రజలకు సాయంగా కేంద్ర ప్రభుత్వోద్యోగుల(రెవిన్యూ శాఖ) ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్ నిధికి జమ చేయాలని ఆదేశించింది.

Tags: DA, Dearness Allowance, Central Government, Coronavirus

Advertisement

Next Story