ఫ్లాష్ ఫ్లాష్ : కేంద్రమంత్రి అరెస్టు.. ఆ రోజు ‘ఉద్ధవ్’ చెంప పగులగొట్టేవాడిని..!

by Anukaran |   ( Updated:2021-08-24 05:08:29.0  )
sivasena
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్ధశ్ థాకరే పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కేంద్రమంత్రి నారాయణ్ రాణేను నాసిక్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అరెస్టు చేశారు. ఆయనపై నాలుగు ఎఫ్‌ఆర్‌లు నమోదయ్యాయి. బాంబే హైకోర్టులో కేంద్రమంత్రి నారాయణ్ రాణే ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకోగా రత్నగిరి కోర్టు దానిని తిరస్కరించింది.

వివరాల్లోకి వెళ్లితే.. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి నారాయణ రాణే సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం థాకరే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న థాకరే చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ముఖ్యమంత్రికి స్వాత్రంత్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాత్రంత్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాత్రంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటే.. ముఖ్యమంత్రి ‘‘చెంప పగలగొట్టేవాడిని’’ అని రాణే తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త పెను దుమారం లేపాయి. దీంతో బీజేపీ, శివసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పలు చోట్ల శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్రమంత్రికి అరెస్టుకు ముందు ఆయనకు బందోబస్తును కూడా పెంచినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story