ఎయిమ్స్‎ను పరిశీలించిన కిషన్‎రెడ్డి

by Shyam |
ఎయిమ్స్‎ను పరిశీలించిన కిషన్‎రెడ్డి
X

దిశ, వెబ్‎డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని పరిశీలించి.. అక్కడ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఎయిమ్స్‎కు కావాల్సిన సౌకర్యాలు, ఆస్పత్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. బీజేపీ నేతలు సైతం మాస్కులు ధరించాలని ఆదేశించారు. వచ్చేది పండుగల సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed