- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్ని ఇండ్లు కట్టినా…కేంద్రం వాటా తెచ్చే బాధ్యత నాదే….
దిశ, ముషీరాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇండ్లు కట్టినా కేంద్రం వాటాను తీసుకువచ్చే బాధ్యత తనదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని సాయిచరణ్ కాలనీలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లబ్ధిదారులు కలిసి ఇండ్ల నిర్మాణంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ పనులు పూర్తి కాలేదని, ఏమాత్రం నాణ్యత లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. రెండు సంవత్సరాల క్రితం శంకుస్థపాన చేసిన ఇండ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఇండ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని విమర్శించారు. పక్క రాష్ట్రంలో కేంద్రం నిధులతో ఇప్పటికే 7లక్షల ఇళ్లను పూర్తి చేశారని చెప్పారు. హైదరాబాద్‌లో దాదాపు 20 లక్షల మంది పేదవారికి ఇండ్ల అవసరం ఉందన్నారు. వారందరికీ ఇండ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో యుద్ధ ప్రాతిపదికన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌళిక సదుపాయాలను కల్పించాలని సూచించారు.