సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..

by Shyam |
సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అందుకోసం కేంద్రం ఇప్పటికే రూ.789 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని.. రాష్ట్రం వాటా రూ.414 కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ వెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని కేంద్రమంత్రి కోరారు.

=

Advertisement

Next Story