ఫ్లాష్ ఫ్లాష్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం

by srinivas |
kishan-reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు తీవ్ర గాయమైంది. జనఆశీర్వాద యాత్రలో భాగంలో గురువారం ఉదయం ఆయనకు గాయమైనట్టు తెలుస్తోంది. నిన్న తిరుపతిలో జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి ఈ రోజు యాత్ర ముగించుకుని విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళారు. అదే సమయంలో కారు డోరు బలంగా తగలడంతో తలకు తీవ్రగాయమైనట్టు తెలుస్తోంది. దుర్గగుడి దర్శనం అనంతరం టెంపుల్ నుంచి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ నివాసానికి బయలు దేరారు. కిషన్ రెడ్డి వెంట మంత్రి వెల్లంపల్లి ఉన్నారు. ఇదిలాఉండగా, కేంద్రమంత్రి తలకు గాయం కావడంతో బీజేపీ శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యారు.

Advertisement

Next Story