రూ.10వేల పరిహారం అందుకే : కిషన్ రెడ్డి

by Shyam |   ( Updated:2020-11-11 07:24:04.0  )
రూ.10వేల పరిహారం అందుకే : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. వీటి వలన లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మునుపెన్నడూ లేనంతగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో వరదల పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర బృందం హైదరాబాద్‌ కు వచ్చింది. ప్రభుత్వంతో చర్చలు జరిపి, అనంతరం గ్రౌండ్ లెవల్‌ లో సైతం పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ చొరవ మేరకే కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిందని చెప్పారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ బృందానికి నష్ట నివేదిక ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే బాధితులకు రూ.10వేల పరిహారం పంపిణీ చేస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కరోనా విషయంలో కేంద్ర ఎం చర్యలు తీసుకుందో చర్చించేందుకు తాము సిద్ధమని కేంద్రమంత్రి సవాల్ విసిరారు. ఉపఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దుబ్బాకలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

Advertisement

Next Story