- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో సెంట్రల్ జైలు ఖైదీ మృతి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతూ, విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. సామాన్య జనాలకే కాకుండా, జైల్లలో ఉన్న ఖైదీలకు కూడా సోకుతూ, భయబ్రాంతులకు గురిచేస్తోంది. కడప జిల్లాలో మొన్న మొన్న 755 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క జిల్లా సెంట్రల్ జైల్‌లోనే 317 కేసులు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా రేపింది.
మొత్తం 700 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా 317 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వీరందరినీ జైల్లోనే ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్టు జైలు అధికారులు మీడియాకు వెల్లడించారు. అయితే తాజాగా సెంట్రల్ జైల్లో కరోనాతో లింగన్న( 56) అనే ఖైదీ మృతిచెందాడు. ఇది కడప కారాగారంలొ తొలి మరణంగా చెబుతున్నారు. మృతుడుది కర్నూలు జిల్లాగా గుర్తించారు.
Advertisement
Next Story