- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shocking: రాష్ట్రంలో మరోసారి స్వల్ప భూకంపం..
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మరోసారి స్వల్ప భూకంపం(Minor Earthquake) సంభవించింది.ప్రకాశం జిల్లాలోని(Prakasam District) తుళ్లూరు మండలంలో(Tullur Mandal) రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లులో భూప్రకంపనలు వచ్చాయి. అంతేగాక ముండ్లమూరు, వేంపాడు పహా మారెళ్ల, తుర్పు కంభంపాడు, శంకరాపురంలో కూడా స్వల్పంగా భూమిలో అలజడులు ఏర్పడ్డాయి. ఈ ప్రకంపనలకు ముండ్లమూరు పాఠశాలలోని(Mundlamuru School) విద్యార్థులు భయంతో ఒక్కసారిగా బయటకి పరుగులు తీశారు. అంతేగాక ప్రభుత్వకార్యాలయాల్లోని ఉద్యోగులు(Government Offices) సైతం భూ ప్రకంపనలకు బయటికి వచ్చారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస భూ ప్రకపంనలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దీంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. వీటికి గల కారణాలను తెలపాలని ప్రజలు వాతావరణ శాఖ అధికారులను కోరుతున్నారు.