సరుకు రవాణాను అడ్డుకోవద్దు : కేంద్ర హోంశాఖ

by Shamantha N |
సరుకు రవాణాను అడ్డుకోవద్దు : కేంద్ర హోంశాఖ
X

దిశ, న్యూస్‌బ్యూరో : ట్రక్కులు, సరుకు రవాణా చేసే ఇతర వాహనాలను అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక పాసులడుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అలాంటివేమీ అవసరం లేదని, వాటిని ఏ ఆటంకం లేకుండా వెళ్లనివ్వాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా కోరారు. ఈ మేరకు గురువారం ఆయన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఒక లేఖ రాశారు. ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం సరుకు రవాణా వాహనాలైన ట్రక్కులు, తదితర వాహనాలు నడపడానికి అనుమతిచ్చిన విషయాన్ని లేఖలో ఆయన గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వస్తు, సేవల సరఫరాకు‌గాను అంతర్ రాష్ట్ర సరిహద్దుల ద్వారా సరుకు రవాణా వాహనాల కదలిక అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఖాళీ ట్రక్కులను సైతం ఆపవద్దని కోరారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయమై జిల్లా స్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి క్షేత్రస్థాయి సిబ్బందికి సరైన ఆదేశాలు వెళ్లేలా చూడాలని ఆయన సూచించారు.

Tags : goods transport, movement of trucks, interstate borders, permissions

Advertisement

Next Story