- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
14 మంది నాగాలాండ్ పౌరులను ఆర్మీ ఎందుకు చంపిందంటే? : అమిత్ షా
దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య భారతంలోని నాగాలాండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు మరణించిన విషయం తెలిసిందే. అనంతరం ఒటింగ్ గ్రామస్తులు స్థానిక ఆర్మీ క్యాంపుపై దాడి చేసి దుకాణాలను ధ్వంసం చేశారు. పలు ఆర్మీ వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీనిపై స్థానిక నాగాలాండ్ పోలీసులు ఆర్మీ బలగాలపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శించగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వివరణ ఇచ్చారు. అక్కడి పౌరులు అనుమానంగా కనిపించడంతో ఉగ్రవాదులుగా భావించి భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని అమిత్ షా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆర్మీ పొరబడిందన్నారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో పొరపాటున కాల్పులు జరిపారని తేలిందన్నారు. నాగాలాండ్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తామని అమిత్ షా పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. కాగా, చనిపోయిన వారంతా స్థానికంగా తిరు ప్రాంతంలోని బొగ్గు గనిలో పనిచేసే కార్మికులుగా తెలుస్తోంది.