CBSE ప్రవేశ పరీక్షలపై రేపు కేంద్రం సమీక్ష..

by Shamantha N |
CBSE ప్రవేశ పరీక్షలపై రేపు కేంద్రం సమీక్ష..
X

న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ పరీక్షలు, జేఈఈ, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలపై రేపు (ఆదివారం) కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా వేసింది. జేఈఈ, నీట్, క్లాట్ లాంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గాను ఈ సమావేశాన్ని కేంద్ర మంత్రి రమేశ్ ప్రోఖ్రియాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. వర్చువల్‌గా నిర్వహించే ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు, స్టేట్ ఎగ్జామినేషన్ బోర్డ్స్ చైర్ పర్సన్‌లు పాల్గొననున్నారు. విద్యార్థులు, తల్లి దండ్రులు, నిపుణుల సలహాలు, సూచనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం ప్రవేశ పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed