‘టూల్ కిట్‌’పై ట్వీట్స్‌కు ట్యాగ్ ఎందుకు పెట్టారు : కేంద్రం

by Shamantha N |
‘టూల్ కిట్‌’పై ట్వీట్స్‌కు ట్యాగ్ ఎందుకు పెట్టారు : కేంద్రం
X

న్యూఢిల్లీ : బీజేపీ ఆరోపిస్తున్న కాంగ్రెస్ టూల్ కిట్‌పై చేసిన ట్వీట్‌కు ట్విట్టర్ సంస్థ ‘మ్యానిపులేట్ మీడియా’ అని ట్యాగ్ పెట్టింది. ఈ ట్వీట్ తప్పుదారి పట్టించేలా ఉన్నదని పేర్కొంది. ఈ ట్యాగ్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. టూల్ కిట్‌ అంశం దర్యాప్తు ఏజెన్సీ ముందున్నదని, కాబట్టి, ట్విట్టర్ స్వతహాగా న్యాయనిర్ణేతగా మారి ట్యాగ్ పెట్టడం సరికాదని వివరించింది. టూల్ కిట్‌లోని కంటెంట్ నేరపూరితమైనదా? కాదా? అనేది దర్యాప్తు ఏజెన్సీలూ నిర్ధారిస్తాయని, అది ట్విట్టర్ పని కాదని తెలిపింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పింది.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నట్టుగా ఆ టూల్ కిట్ పేర్కొంటున్నదని అభిప్రాయాలున్నాయి. ఈ టూల్ కిట్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు మ్యానిపులేటెడ్ అనే ట్యాగ్ ట్విట్టర్ పెట్టింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ గ్లోబల్ టీమ్ ముందు నిరసన తెలియజేసినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed