కరోనా నివారణకు కేంద్రం నిధులిస్తలేదు : ఈటల

by Shyam |
కరోనా నివారణకు కేంద్రం నిధులిస్తలేదు : ఈటల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. దానికి బదులు చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి అని పలు ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకుందని వ్యాఖ్యానించారు. కరోనాను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల తమకున్న కమిట్‌మెంట్‌ ఎవరికీ ఉండదని మంత్రి ఈటల వివరించారు. విపత్కర సమయంలో కమలనాధులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ఇలా రాజకీయం చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story