- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాతో పోరుకు .. ఆన్ లైన్ శిక్ష్క్షణ
దిశ వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. రోజురోజుకు వందలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది. మన దేశంలోనూ కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు.. భారత్ కూడా కరోనా తో పోరాడుతోంది. అయితే విదేశాల్లో ఉన్నంత దారుణ పరిస్థితి ఇండియాలో లేనప్పటికీ వ్యాధి వ్యాప్తిని నిరోధించాల్సి ఉంది. ప్రస్తుతానికి మనం రెండో దశలో ఉన్నాం. ఈ దశ దాటితే.. పరిస్థితి మన చేయి దాటిపోతోంది. మ్యాన్ పవర్ ఇంతకు రెట్టింపు అవసరం అవుతోంది. అందుకోసం కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. కరోనాపై పోరాటానికి వీలైనంత ఎక్కువవమందిని భాగస్వాములు చేయడానికి ‘దీక్ష’ అనే ఆన్ లైన్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కోవిడ్ పై పోరాటానికి ఇప్పటికే ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వలంటీర్లు ఇలా అందరూ తమ వంతు బాధ్యతతో తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలో పౌరుల అవసరం ఉంది. కరోనా ను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ తమ పోర్టల్ లో ‘ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ ట్రైనింగ్ (ఐజీఓటీ) అనే పేరుతో ఓ ప్లాట్ ఫాంను ప్రారంభించింది. ఇందులో ప్రతి ఒక్కరూ శిక్షణ పొందవచ్చు. వలంటీర్లు, డాక్టర్లు, నర్సులు, ఎన్సీసీ, ఏెఎన్ఎంలు, పారిశుద్ధ్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఎన్ఎస్ఎస్ ఇలా వీరందరితో పాటు.. స్వచ్ఛందంగా వచ్చే పౌరులు కూడా ఆన్ లైన్ లో నేర్చుకోవచ్చు. ఈ సమాజానికి తమ వంతు సాయాన్ని అందించవచ్చు.
Tags: coronavirus, lockdown, deeksha, i got, central govt,