మృతుల కుటుంబాలకు కేంద్ర పరిహారం..

by Shamantha N |
మృతుల కుటుంబాలకు కేంద్ర పరిహారం..
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది కరోనా బాధితులు చనిపోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఈ నిధులను PMNRF కింద విడుదల చేయనున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున పరిహారం అందనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. విజయవాడలో ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పీఎం మోదీ స్వయంగా వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story