పంద్రాగస్టు మార్గదర్శకాలు విడుదల

by Anukaran |   ( Updated:2020-07-23 08:59:28.0  )
పంద్రాగస్టు మార్గదర్శకాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పంద్రాగస్టు వేడుకలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ కట్టడికి కృషిచేస్తున్న కరోనా వారియర్స్‌ను స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కరోనా దృష్ట్యా భారీగా జనసమీకరణ లేకుండా రాష్ట్ర రాజధానుల్లోనే వేడుకలను నిర్వహించాలని సూచించింది. మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించే పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు తప్పనిసరి మాస్క్ ధ‌రించాల‌ని మర్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. కాగా, ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. అలాగే కరోనా విజేతలు 1500 మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

Advertisement

Next Story