నైట్ కర్ఫ్యూ విధించండి.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

by Anukaran |   ( Updated:2021-12-23 05:48:40.0  )
Corona virus, night curfew
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మార్గదర్శకాలు విడుదల చేశారు. రానున్న క్రిస్మస్ పండుగ, న్యూయర్ వేడుకల్లో భారీగా జనాలు గుమిగూడే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కరోనా కేసులు అధికంగా ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాలని, భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని సూచించింది. కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున అన్ని వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చూడాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించింది. అంతేకాకుండా, ముప్పు రాకముందే కఠిన ఆంక్షలు అమలుచేయాలని, కనీసం 14 రోజులైన అవి అమలులో ఉండేలా చూడాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed