- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది మేం స్వాగతిస్తున్నాం: మంత్రి ఆదిమూలపు
దిశ, ఏపీ బ్యూరో: నిష్ఠా (నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్‌మెంట్) కార్యక్రమం ద్వారా లక్షా యాభైవేల మంది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 1200 మంది కీ రిసోర్సు పర్సన్లకు నిష్ఠా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆన్‌లైన్ వెబినార్ ద్వారా ప్రారంభించిన సందర్భంగా అమరావతిలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్సీఈఆర్టీకి రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
రాష్ట్రంలో విద్యాశాఖ అమలు చేస్తోన్న ‘అమ్మ ఒడి, ‘మనబడి’, ‘నాడు–నేడు’, ‘ఆంగ్లమాధ్యమ ఆవశ్యకత, ‘జగనన్న గోరుముద్ద’ తదితర కార్యక్రమాలతో పాటు ‘జగనన్న విద్యాకానుక’ గురించి వివరించారు. ప్రాథమిక స్థాయిలో అందరు ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, రాష్ట్ర పరిశోధనా శిక్షణా సంస్థల అధ్యాపకులు, డైట్లతో పాటు మండల వనరుల కేంద్రం, సముదాయ వనరుల కేంద్రాల నుంచి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వడం నిష్ఠా లక్ష్యమని తెలిపారు.