'మిడ్ డే మీల్’ కింద నగదు అందజేత.. 11.8 కోట్ల విద్యార్థులకు లబ్ది

by Shamantha N |   ( Updated:2021-05-28 07:55:19.0  )
మిడ్ డే మీల్’ కింద నగదు అందజేత.. 11.8 కోట్ల విద్యార్థులకు లబ్ది
X

న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం ఏర్పడవద్దనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మిడ్ డే మీల్’ పథకం కింద విద్యార్థులకు నేరుగా నగదు అందజేయాలనే ప్రతిపాదనను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఆమోదించారు. ఈ పథకం కింద వంట(కుకింగ్) చార్జీలను 11.8 కోట్ల స్టూడెంట్లకు బదిలీ చేయనుంది. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 1200 కోట్లను అందించనున్నట్టు విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయంతో 11.20 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తు్న్న పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువతున్న విద్యార్థులకు లబ్ది చేకూరనుందని వివరించింది. పిల్లల్లో పౌష్టికాహర లోపం ఏర్పడకుండా కాపాడటానికి, ప్రస్తుత సంక్షోభ సమయంలో రోగనిరోధక శక్తి కలిగి ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed