- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాయపట్నం పోర్టుపై జగన్ కి షాక్..! చేతులెత్తేసిన కేంద్రం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం పెద్దపోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రానిదని తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని.. నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఆ పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే చట్టంలో మార్పులు తేవాల్సి ఉంటుందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న దుగరాజ పట్నం పోర్టుకు బదలుగా రామాయపట్నం మేజర్ పోర్ట్ కు నిధులు కావాలని మొదట కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ తర్వాత ఏ కారణమో తెలియదుకానీ.. గత ఏడాది ఫిబ్రవరి 20న రామాయపట్నం మేజర్ పోర్ట్ ను నాన్ మేజర్ పోర్ట్ గా మార్చుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే చాన్స్ అనుకుని కేంద్రం అసలు పోర్టు హామీని నెరవేర్చడానికి కుదరదని తేల్చి చెప్పేసింది.
రామాయపట్నం నాన్ మేజర్ పోర్ట్ కు నిధులు మంజూరు చేయడం సాధ్యం కాదని.. కేంద్రం పార్లమెంట్‌లో తేలిపింది. మేజర్ పోర్ట్ లకు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుందని కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. ఒక వేళ నాన్ మేజర్ పోర్టు అయిన రామాయపట్నంకు నిధులు ఇవ్వాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని లేకపోతే.. నిధులు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం వాదిస్తోంది. దీంతో పూర్తి నిర్మాణ బాధ్యత జగన్ సర్కార్ పై పడింది.
పోర్టు నిర్మాణం భారం జగన్ సర్కార్ దేనా..?:
ఇదిలా ఉంటే రూ. 14 వేల కోట్ల అంచనాలతో రెండు దశల్లో ఈ పోర్టును నిర్మించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అందుకు కావాల్సిన బిడ్ లను సైతం ఆహ్వానించింది. అరబిందో రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,634 కోట్ల రూపాయలతో బిడ్ ను సమర్పించింది. ఈ పోర్టు నిర్మాణానికి కేంద్రం నుండి సహాయం అందుతుందని భావించిన ఏపీ సర్కార్ కు తాజాగా కేంద్ర ప్రకటన షాక్ ఇచ్చింది. దీంతో రామాయపట్నం పోర్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా ఇప్పుడు జగన్ సర్కార్ పై పడటంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లైంది.