కరోనాపై నీతిఅయోగ్ బృందం సమీక్ష..

by Shamantha N |
కరోనాపై నీతిఅయోగ్ బృందం సమీక్ష..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై నీతిఅయోగ్ సభ్యుల సమీక్ష కొనసాగుతోంది. సుమారు 5 గంటలుగా రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యాధికారులతో వారి సమావేశం కొనసాగుతోంది.

కేంద్ర సభ్యుల బృందం వీకే పాల్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఏయే ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయో వాటిపైన రివ్యూ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే, కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర బృందానికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed