కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

by Shamantha N |   ( Updated:2021-07-08 09:29:27.0  )
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 736 జిల్లాల్లో పిల్లల కోసం చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా 20 వేల ఐసీయూ పడకలు, 4,17,396 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాస్థాయిలో 10వేల లీటర్ల ఆక్సిజన్‌ నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కరోనాను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ కింద రూ.23,123 కోట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి లక్ష కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించింది. మూడు వ్యవసాయ చట్టాల అమలులో భాగంగా వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed