రాయపాటి ఆస్తుల వేలానికి రంగం సిద్ధం!

by Anukaran |   ( Updated:2020-07-25 09:09:34.0  )
రాయపాటి ఆస్తుల వేలానికి రంగం సిద్ధం!
X

దిశ, వెబ్‌డెస్క్ :
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సెంట్రల్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. అతనికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ లిమిటెడ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధంచేసింది. కన్‌స్ట్రక్షన్ కంపెనీ అయిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ గతంలోనే సెంట్రల్ బ్యాంకుకు రూ.452.41 కోట్లు బకాయి పడింది. వాటిని ఇంతవరకు చెల్లించలేదు. దీంతో కంపెనీ తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయడానికి బ్యాంక్ సిద్ధమైంది. ఆగస్ట్ 18న కంపెనీ వేలం నిర్వహించనుంది. వేలంలో పాల్గొనాలనుకునే వారు ఆగస్ట్ 14వ తేదీ లోపు బిడ్స్ దాఖలు చేయడానికి గడువు పెట్టింది.

కొన్ని రోజుల కిందట రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్‌ పత్రికా ప్రకటన జారీచేసింది. ఆంధ్రాబ్యాంకు నుంచి ఈ రుణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియాతో పాటు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మిపేరిట తీసుకున్నారు. ఈ రుణానికి గ్యారంటెర్లుగా రాయపాటి జగదీష్‌, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్‌ వాణి, జగన్‌మోహన్‌ యలమంచలి ఉన్నారు. మిగిలిన వివరాలకు ఆంధ్రాబ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా టెండర్స్‌ డాట్‌ గవ్‌ డాట్‌ ఇన్‌ను సంప్రదించాల్సిందిగా బ్యాంక్ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story