కరోనా అలర్ట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

by vinod kumar |   ( Updated:2021-03-19 22:54:05.0  )
Corona positive
X

దిశ,వెబ్ డెస్క్:కరోనా తో ప్రపంచమంతా వణికిపోతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న ఈ మహమ్మారిని నియంత్రించడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పలు సూచనలు తెలుపుతూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. దేశంలో కరోనా ఎక్కువతున్న వేళ అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి పై నియంత్రణ చర్యలను మార్చి 31 వరకు పొడిగించాలని ఆదేశించారు.

ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లను తప్పనిసరిగా వాడాలని సూచించించారు. త్వరలో పండగలు వస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధలను కఠినతరం చేయాలనీ, కరోనా నివారణ చర్యలు, మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు తమవంతు కృషిచేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed