- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలి: బీజేడీ
by Shamantha N |
X
భువనేశ్వర్: ఒడిశాలో అధికారిక పార్టీ బిజు జనతా దళ్(బీజేడీ) సాగు చట్టాలపై తొలిసారిగా తన వైఖరిని బహిరంగపరిచింది. కేంద్రం వెంటనే సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే నేటి సంక్షోభ పరిస్థితులకు కారణమని ఆరోపించింది. బీజేడీ సాధారణంగా చాలా అంశాల్లో కేంద్రానికి మద్దతునిస్తుంది.
సాగు చట్టాలనూ లోక్‌సభలో ఆమోదించి రాజ్యసభలో వ్యతిరేకించి ఆశ్చర్యపరిచింది. తాజాగా, తొలిసారి సాగు చట్టాలపై తన వైఖరిని వెల్లడిస్తూ కేంద్రంపై విమర్శలు చేసింది. సాగు చట్టాలను సెలెక్ట్ కమిటీ లేదా స్టాండింగ్ కమిటీకి పంపించి చర్చలు జరిపితే రైతుల్లో సందేహాలుండేవి కావని తెలిపింది. అందుకే ఈ చట్టాలు వెనక్కి తీసుకుని సాగు సంస్కరణలపై మళ్లీ కొత్త బిల్లులను ప్రవేశపెట్టి చర్చకు ఆస్కారమివ్వాలని బీజేడీ నేత పినాకి మిశ్రా అభిప్రాయపడ్డారు.
Advertisement
Next Story