వైజాగ్ గ్యాస్ లీక్‌పై కేంద్రం స్పందన ఇదీ..!

by srinivas |
వైజాగ్ గ్యాస్ లీక్‌పై కేంద్రం స్పందన ఇదీ..!
X

దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాల పట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో నేటి తెల్లవారు జామున స్టైరీన్ కెమికల్ లీకేజీ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 300 మంది బాధితులున్నారని సమాచారం. దీనిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పందించారు. లీకేజీపై కేంద్ర హోం శాఖను ఆరాతీశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడి ఆరా తీశారు. ఈ సందర్భంగా అజయ్ భల్లా మాట్లాడుతూ.. విశాఖకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపినట్టు చెప్పారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యలు జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. వెంటనే ఆయన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌లతో మాట్లాడి, బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించాలని, ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు.

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, విశాఖపట్నంలోని పరిస్థితులపై హోం శాఖ, ఎన్‌ఎమ్‌డీఏ అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపి, బాధితులంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

కిషన్ రెడ్డి స్పందిస్తూ, విశాఖలోని ప్రైవేటు సంస్థలో గ్యాస్‌ లీక్‌ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఏపీ సీఎస్, డీజీపీలతో మాట్లాడినట్టు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలని ఎన్డీఆర్ఎప్ సిబ్బందికి సూచించినట్టు తెలిపారు. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దీనిపై స్పందిస్తూ, కరోనా వైరస్‌తో పోరాడుతున్న సమయంలో విశాఖ పట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటన చోటు చేసుకోవడం షాక్‌కు గురి చేసిందని అన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయని చెప్పారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాదితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఏపీ ప్రభుత్వ అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags: chemical leak, styrene leak, vizag, central responce, venkaiah naidu, pm modi, kishan reddy

Advertisement

Next Story