కరోనాకు కణ థెరపీ… ఎఫ్‌డీఏ అప్రూవల్

by vinod kumar |
కరోనాకు కణ థెరపీ… ఎఫ్‌డీఏ అప్రూవల్
X

దిశ, వెబ్‌డెస్క్: కేన్సర్ వంటి జబ్బులకు కణ థెరపీ ద్వారా ట్రీట్‌మెంట్ అభివృద్ధి చేసిన సెల్యూలారిటీ సంస్థకి కొత్తగా కరోనాకు కూడా కణథెరపీ ద్వారా ట్రీట్‌మెంట్ అభివృద్ధి చేసేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి ప్రాథమిక క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించే పనికి ఎఫ్‌డీఏ అప్రూవల్ లభించింది. నేచురల్ కిల్లర్స్ (ఎన్కే) సెల్ థెరపీ ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే రోగాలను కట్టడి చేసే టెక్నాలజీ తయారుచేసే ఈ కంపెనీకి ఇప్పటికే 290 మిలియన్ డాలర్ల గ్రాంట్ లభించింది.

ఆసుపత్రులు మెడికల్ వేస్టుగా భావించే ప్లాసెంటల్ కణజాలం నుంచి సెల్యూలారిటీ కంపెనీ మూలకణాలు సృష్టించి, వాటి నుంచి ఎన్కే కణాలను తయారు చేస్తుంది. కణాల తయారీకి ప్రత్యేకమైన డోనార్ అవసరం లేని కారణంగా ఈ కంపెనీకి పెట్టుబడి సాయం చేయడానికి చాలా బయోటెక్నాలజీ సంస్థలు ముందుకొచ్చాయి. ఎన్కే కణాలను తయారు చేయడమే కాకుండా వాటిని భద్రపరిచే టెక్నాలజీ కూడా సెల్యూలారిటీ వద్ద ఉంది. ఇలా భద్రపరిచిన ఎన్కే కణాలను అవసరమైనపుడు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్‌డీఏ అప్రూవల్ తర్వాత 86 మందితో క్లినికల్ ట్రయల్ ప్రారంభించి వారిపై సీవైఎన్కే 001 ఇమ్యునోథెరపీ ప్రయోగించనున్నారు. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పరిశోధనలకు కూడా ఈ నేచురల్ కిల్లర్ థెరపీ ఉపయోగించబోతున్నట్లు సమాచారం.

నేచురల్ కిల్లర్స్ కణాలు అనేవి శరీర వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే తెల్లరక్తకణాలు. టీ కణాల మాదిరిగా ప్రత్యేకమైన అవయవ పాథోజన్లను కాకుండా ఈ ఎన్కే కణాలు, శరీరంలో తేడాగా కనిపిస్తున్న కణాలను నాశనం చేసి నిరోధక శక్తిని పెంపొందించడంలో కృషి చేస్తాయి. కణాల అభివృద్ధి అధికంగా ఉండే కేన్సర్ ట్రీట్ చేయడం ఈ థెరపీ విజయవంతంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

Tags: Cell Therapy, NK cells, Natural Killers, FDA, Immunity

Advertisement

Next Story