సెలీనా హార్ట్ బ్రేకింగ్ స్టోరీ..

by Jakkula Samataha |
సెలీనా హార్ట్ బ్రేకింగ్ స్టోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా అభిమానులతో బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ ఎమోషనల్ స్టోరీ షేర్ చేసుకుంది. తన కొడుకు అర్థుర్ జైట్లీ హాగ్‌తో పాటు ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సెలీనా..ప్రీటర్మ్ బేబీస్ ఎలా ఆరోగ్యంగా ఎదగగలరో వివరించింది. అర్థుర్‌తోపాటు పుట్టిన మరో బేబి కూడా ప్రీమెచ్యూర్ బేబి అని.. డాక్టర్లు, నర్సుల కేరింగ్.. దేవుడికి తాము చేసిన ప్రార్థనతో అర్థుర్ ఇలా హెల్దీగా ఎదుగుతున్నాడని చెప్పింది. పుట్టుకతో వచ్చిన గుండె సమస్యతో దురదృష్టవశాత్తు ఒక బేబిని కోల్పోయామని తెలిపింది. దుబాయ్‌లోని ఎన్ఐసీయూ డాక్టర్లు, నర్సులు అందించిన ట్రీట్‌మెంట్‌తో అర్థు తమతో తిరిగి ఇంటికి వచ్చాడని చెప్పింది.

నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల విషయంలో తల్లిదండ్రులు మరింత కేరింగ్‌గా ఉండాలని సూచించింది. తల్లిపాలు, వైద్యులపై నమ్మకం, ప్రేమ అద్భుతాలు చేయగలదని ఆమె అభిప్రాయపడింది. అలాంటి పిల్లలు కూడా మెడికల్ ఇష్యూస్‌ను అధిగమించి ఆరోగ్యవంతంగా మారే అవకాశం ఉందని తెలిపింది. విన్‌స్టన్ చర్చిల్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాదిరిగా సమాజంలో ప్రముఖులుగా రాణిస్తారనే నమ్మకం ఉంచాలని కోరింది. అఫ్ కోర్స్ అర్థు కూడా ఈ కేటగిరిలోకి వస్తాడన్న సెలీనా.. ప్రీ మెచ్యూర్డ్ పిల్లలకు మరింత మద్దతు అవసరమని తెలిపింది.

Advertisement

Next Story