కూతుళ్లే మా సంపద : సెలెబ్రిటీలు

by Anukaran |
కూతుళ్లే మా సంపద : సెలెబ్రిటీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇల్లు.. మహాలక్ష్మి కొలువైన దేవాలయమే. ఆడపడుచులు ఉన్న ఇల్లే.. కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. ఈ రోజు ‘ఇంటర్నేషనల్ డాటర్స్ డే’ సందర్భంగా సెలెబ్రిటీలందరూ తమ తమ కూతుళ్లతో ఉన్న పిక్స్‌ను షేర్ చేయడమే కాకుండా.. మధురమైన జ్ఞాపకాలను, విలువైన సూచనలను అందిస్తున్నారు.

‘కూతుళ్లు ఈ భూమీ మీద అడుగుపెట్టిన దేవదూతలు.. హ్యాపీ డాటర్స్ డే’ – అల్లుఅర్జున్

‘లవ్లీ డాటర్స్ అందరికీ హ్యాపీ డాటర్స్ డే. ఆద్యంత.. నువ్వు నా లైఫ్‌ను సంపూర్ణం చేశావు – స్నేహ

‘ఎవరు చెప్పారు అద్భుతాలు జరగవని. నిన్ను నా చేతులతో పట్టుకున్నానంటే.. అది అద్భుతమే. సమీషా చేతులు పట్టుకుని నేను డాటర్స్ డే జరుపుకుంటున్నాను. ఈ రోజు మీ కూతురికి గట్టిగా హగ్ ఇవ్వడం మరిచిపోవద్దు’ – శిల్పాశెట్టి.

‘నువ్వు నా పరిపూర్ణతకు నిదర్శనం. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. హ్యాపీ డాటర్స్ డే మై బేబీ గర్ల్’ – అక్షయ్ కుమార్

‘ఈ ప్రపంచాన్ని నడిపేది ఎవరు? ఇంకెవరు ఆడపిల్లలే. ఈ రోజు మీ రోజే. మీకు ఆకాశమే హద్దు. 2020 ఆడపిల్లలు, కూతుళ్లదే. మనతోనే మార్పు మొదలవ్వాలి ’ – సమీరా రెడ్డి

‘నైసా.. నా విమర్శకురాలు, నా బలహీనత, నా బలం. ఆమె అందరికీ యంగ్ గర్ల్‌గా కనిపించొచ్చు. కానీ నాకు, కాజోల్‌కు నైసా ఇంకా చిన్న పిల్లే’ – అజయ్ దేవగన్

అమితాబ్ బచ్చన్, నేహా ధూపియా, యాంకర్ ఝాన్సీ, శివకార్తికేయన్, గీతామాధురి, మాన్యత, కునాల్ ఖేమ్, ఆయుష్మాన్ ఖురానా ఇంకా చాలా మంది సెలబ్స్ డాటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story