వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : ఉత్తమ్

by Anukaran |
Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా నేడు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఒక్కటే.. ఈ దేశం కోసం.. ఈ మట్టి కోసం పని చేస్తోందని అన్నారు. దేశంలో మొదటగా జై జవాన్.. జై కిసాన్ అన్న నినాదం కాంగ్రెస్ తీసుకొచ్చింది అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్ దరిద్రపు పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రైతులను నట్టేట ముంచి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్పీ ఇవ్వాల్సిన ప్రభుత్వం.. లాభ నష్టాల గురించి ఆలోచిస్తుందని మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని… పార్టీ నాయకులు నిరుత్సాహ పడొద్దు అని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాకుండా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed