- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పెట్ యానిమల్స్‌కు.. ట్రెడిషనల్ సెలెబ్రేషన్స్
దిశ, వెబ్‌డెస్క్: మన జీవితంతో ముడిపడిన ప్రతి మధురఘట్టాన్ని ఓ వేడుకగా చేసుకోవడం మన సంప్రదాయం. గృహప్రవేశం, పెళ్లి, సీమంతం, బారసాల, దత్తత, అక్షరాభ్యాసం ఇలా ఈ జాబితా కాస్త పెద్దదే. అయితే మనకే కాదు, మనతో పాటు జీవించే, మనం ఎంతో ప్రేమించే పెంపుడు జంతువులకు కూడా ఇలాంటి వేడుకలు చేస్తున్నారు కొంతమంది. మరి తమ పెట్ యానిమల్స్‌కు చేస్తున్న ఆ వేడుకలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మనం కొత్త ఇంట్లో అడుగుపెట్టే సందర్భాన్ని ఎప్పటికీ మన మదిలో గుర్తుంచుకునేలా ఫుట్ ప్రింట్స్ తీసుకోవడం, గృహప్రవేశాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటాం. అలానే ఇప్పుడు చాలామంది పెట్స్‌ను ఇంట్లోకి తీసుకొచ్చే సయమంలో ‘గ్రాండ్ వెల్‌కమ్’ పార్టీలు చేయడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన ఓ జంట తమ పెట్ డాగ్‌కు ‘నేమింగ్ సెర్మనీ’ నిర్వహించారు. ఆ బుజ్జి పెట్ డాగ్‌ను మహారాష్ట్ర సంప్రదాయాలు దుస్తుల్లో అలంకరించి, దానికి హారతిచ్చి పూలతో సూపర్బ్‌గా డెకోరేట్ చేసిన ఊయలలో కూర్చోబెట్టారు. దానికి ‘లూసి రాహుల్ కుల్‌కర్ణి’ అనే పేరు పెట్టగా, అతిథులు లూసీకి ఆశీర్వచనాలు అందించారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో తెగ వైరల్ అయింది.
ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కామన్ కాగా, ఇటీవల కాలంలో ‘మెటర్నిటీ షూట్’ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికా, హ్యుస్టన్‌కు చెందిన యానిమల్ కేరర్, టీచర్ ‘కైటీ’ ఇటీవలే ఓ స్ట్రీట్ డాగ్‌ను ఇంటికి తెచ్చుకుని, దానికి ‘లిల్లీ మే’ అని పేరుపెట్టుకుంది. లిల్లీ ప్రెగ్నెంట్ అని కైటీకి తెలియడంతో, మెటర్నిటీ ఫొటో షూట్ జరిపించాలని డిసైడ్ అయింది. లోకల్ పార్క్‌లో లిల్లీకి అద్భుతమైన ఫొటో షూట్ నిర్వహించగా, ఆ తర్వాతి రోజే లిల్లీ ఎనిమిది పప్పీలకు జన్మనిచ్చింది. శునకాలను పెంచుకోవాలనుకున్న వారికి వాటిని ఇచ్చేస్తానని కైటీ తెలిపింది. ‘లిల్లీని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఇంటికి తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. లేకపోతే, దానికి పుట్టిన పప్పీలు చలికి తట్టుకోలేకపోయేవి. ఇక లిల్లీకి మెటర్నిటీ ఫొటోషూట్ చేయించాలన్నా ఐడియా నాదే. ఇలా చేస్తేనైనా స్ట్రీట్ డాగ్స్ పట్ల కొందరి అభిప్రాయాలు మారొచ్చు. హ్యుస్టన్‌లో దాదాపు 1 మిలియన్ స్ట్రీట్ డాగ్స్ ఉండగా, ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు, ఇకనైనా వాటికి తగిన షెల్టర్ దొరకాలని భావిస్తున్నాను’ అని కైటీ తెలిపింది.
సకల దేవతలు కొలువైన ‘గోమాత’న మనం దేవతలా పూజిస్తాం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విజయ్ పాల్, రాజేశ్వరి దేవి దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో, తమ ఇంట్లో పుట్టిన దూడనే కొడుకుగా దత్తత తీసుకోవడం విశేషం. దూడకు జన్మనిచ్చిన ‘ఆవు’ చనిపోవడంతో, ఒంటరైన ‘దూడ’ను దత్తత తీసుకోవడంతో పాటు, దాన్నో వేడుకగా నిర్వహించాడు విజయ్. దానికి లాల్తు బాబాగా పేరు పెట్టుకోగా, దత్తత వేడుకకు 500 మంది అతిథులు హాజరయ్యారు. ఆవును తల్లిగా భావించినప్పుడు, దాని దూడను కొడుకుగా స్వీకరించడంలో ఎలాంటి తప్పులేదని విజయ్ తెలిపాడు. పెట్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌గా భావించి వేడుకలు నిర్వహించడం నిజంగా ఎంతో అభినందనీయం. ఇలాంటి వేడుకలు నిర్వహించడం ప్రస్తుతం కొత్త ట్రెండ్ కాగా, ఇక ముందు జంతు ప్రేమికులు వీరి బాటలో నిలిచి మరిన్ని వేడుకలు నిర్వహించే అవకాశముంది.