‘డోంట్ రష్ చాలెంజ్’లో సెలబ్రిటీస్ రష్

by Jakkula Samataha |   ( Updated:2023-10-10 16:14:55.0  )
‘డోంట్ రష్ చాలెంజ్’లో సెలబ్రిటీస్ రష్
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక గతేడాది కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైమ్‌లో రకరకాల చాలెంజ్‌లు తెరమీదకు రావడం, అందులో సెలబ్రిటీలు కూడా పార్టిసిపేట్ చేయడంతో ఫుల్ పాపులారిటీ లభించింది. ‘మేకప్ నో మేకప్ లుక్స్, బిందీ, పిల్లో, కిమ్ కిమ్, ఫ్లిప్ ది స్విచ్, శారీ వియరింగ్’ వంటి చాలా చాలెంజెస్‌లో సినీ తారలు పాల్గొని వాటిని సూపర్ హిట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ‘డోంట్ రష్’ అనే చాలెంజ్ సెలబ్రిటీలతో పాటు సామాన్యుల దృష్టిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ ప్రైవేట్ ఆల్బమ్ ‘డోంట్ రష్’ రీమిక్స్ వెర్షన్ సాంగ్‌కు సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ ఫిదా చేస్తున్నారు.

చాలెంజ్‌లో భాగంగా హాలీవుడ్ రీమిక్స్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్.. ఆ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. #dontrushchallenge హ్యాష్‌ట్యాగ్‌తో తన డ్యాన్స్ వీడియో షేర్ చేసిన విక్కీ.. ‘ఎలాగూ తాను చాలా టైమ్ వేస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మరింత ఫన్ కోసం ఈ చాలెంజ్‌లో భాగస్వామిని అవుతున్నా’ అని చెప్పాడు. కాగా ఈ చాలెంజ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు. అక్కినేని వారి కోడలు బ్యూటిఫుల్ సమంత.. విక్కీ కౌశల్ డ్యాన్స్‌కు ఇన్‌స్పైర్ అయ్యి, తను ఈ ‘డోంట్ రష్’ చాలెంజ్‌లో పాల్గొన్నట్లుగా చెబుతూ #dontrushchallenge హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇక సామ్ డ్యాన్స్ వీడియో చూసిన నెటిజన్లు ‘సూపర్ డ్యాన్సర్’ అని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, శ్రద్ధాదాస్, ‘దంగల్’ ఫేమ్ హీరోయిన్ అమైరా దస్తూర్, తనుశ్రీ దత్తాతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ చాలెంజ్ యాక్సెప్ట్ చేసి, తమదైన స్టైల్‌లో స్టెప్పులేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story