పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు అనుమతి ఇవ్వండి : ఎస్​ఈసీ అప్పీలు

by srinivas |
ap highcourt
X

దిశ, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్​కు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అప్పీలుకు వెళ్లింది. గురువారమే పిటిషన్​ దాఖలు చేసినా నంబరు కేటాయించడంలో ఆలస్యమైంది. పరిషత్ ఎన్నికలకు మొదట మార్చి7, 2020న నోటిఫికేషన్ విడుదలయింది. టీడీపీ, జనసేన తదితర పార్టీలు పరిషత్ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించడంతో మే 21న ఆగిపోయాయి. ఎన్నికల కొనసాగింపునకు ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

మార్చి 2020 పరిషత్ ఎన్నికల నామినేషన్ల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హైకోర్టు తీర్పు తరువాత కూడా ఆ ఏకగ్రీవాలన్నీ యథాతథంగానే ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున లెక్కింపునకు అనుమతినివ్వాలని కోరుతూ డివిజన్​ బెంచ్​కు ఎస్​ఈసీ అప్పీలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed