CBSC పదో తరగతి ఫలితాలకు ఫార్ములా సిద్ధం

by Harish |
CBSC పదో తరగతి ఫలితాలకు ఫార్ములా సిద్ధం
X

న్యూఢిల్లీ : కరోనా కారణంగా పరీక్షలు రద్దయిన సీబీఎస్ఈ పదో తరగతి విద్యార్థుల మార్కులను అసెస్ చేయడానికి ఫార్ములా సిద్ధమైంది. జూన్ 20లోపు ఫలితాలు వెల్లడించనున్నట్టు బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. పరీక్షలు లేకుండానే వారు 11వ తరగతికి ప్రమోట్ కాబోతున్నారు. 100 మార్కులను అసెస్ చేయడానికి సీబీఎస్ఈ తొలిసారిగా వినూత్న పద్ధతిలో ఓ ప్రక్రియను అమలు చేయనుంది. ఇది వరకు ఉన్న ఇంటర్నల్ అసెస్‌మెంట్ 20 మార్కులు యథావిధిగా ఉంటాయి.

మిగిలిన 80 మార్కులను కొత్త పద్ధతిలో గణించాల్సి ఉంటుంది. దీని ప్రకారం, పీరియాడిక్ టెస్టు లేదా యూనిట్ టెస్టు‌కు పది మార్కులు, హాఫ్ ఇయర్లీ లేదా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్‌కు 30 మార్కులు, ప్రీబోర్డు ఎగ్జామ్స్‌కు 40 మార్కులుగా విభజించి మదించాలి. ఒకవేళ ఏదైనా స్కూల్ ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించి ఉంటే(ఉదాహరణకు ప్రీబోర్డు పరీక్షలు ఒకటికి బదులు మూడు సార్లు నిర్వహించి ఉంటే) వెయిటేజీ లేదా అత్యధిక మార్కులు లేదా యావరేజ్‌ను క్రైటీరియగా తీసుకోవాలని బోర్డు సూచించింది. ఈ ప్రక్రియ కోసం మే 5న స్కూల్స్ రిజల్ట్ కమిటీని వేయాలి. 25న రిజల్ట్స్ ఫైనల్ చేసి జూన్ 5న బోర్డుకు సమర్పించాలి. జూన్ 20లోపు తుది ఫలితాలను ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed