- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రధాని మోడీ సంచలన నిర్ణయం.. CBSC పరీక్షలు రద్దు
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోన్న సమయంలో ప్రధాని మోడీ అధ్యక్షతన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కీలక సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ మీటింగ్‌లో ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల భద్రతే ముఖ్యమని ప్రధాని భావించినట్లు పీఎంవో అధికారులు పేర్కొన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉధృతి తగ్గాక నిర్వహణ విషయమై మళ్లీ నిర్ణయం తీసుకోనున్నట్లు మోడీ తెలిపారు. గతేడాది మాదిరిగానే పరీక్షలు రాయాలనుకునే ఆసక్తి ఉన్నవారు రాయొచ్చని, ఆసక్తి లేని వారికి పరీక్షలు రాయాలని బలవంతం చేయొద్దని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.